Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోటితో వంట చేయ‌డం ఎలాగో తెలుసా?... ఈ వీడియో చూడండి!

  • నోటితోనే కూర‌గాయ‌ల‌ను కోస్తూ వంట‌
  • చివ‌రికి గుడ్డును కూడా
  • చిరాకు వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు
ఇంట‌ర్నెట్‌లో వీడియో వైర‌ల్ అవ‌డం కోసం, జ‌నాలు కొత్త కొత్త ఐడియాల‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. వాటిలో కొన్ని వీడియోలు అబ్బుర‌ప‌రిస్తే... మ‌రికొన్ని మాత్రం చిరాకు క‌లిగిస్తుంటాయి. అలాంటి వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక మ‌హిళ చికెన్ రోస్ట్ చేయ‌డాన్ని చూడొచ్చు.

అయితే ఆమె కూర‌గాయ‌ల్ని కోయ‌డానికి ఎలాంటి క‌త్తులు ఉప‌యోగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాటిని నోటితో కొరికి గిన్నెలో వేయడం జరిగింది. చివ‌రికి నిమ్మకాయ‌ను, గుడ్డును కూడా నోటితో కొరికి, మళ్లీ మిశ్ర‌మంలో వేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఓ వైపు చిరాకు ప‌డుతూనే... షేర్లు కూడా చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మ‌రి!
internet
video
viral

More Telugu News